హైదరాబాద్ నారాయణగూడలో త్రిదండి చినజీయర్ స్వామిజీకి మాతృ వియోగం కలిగింది. ఈ నేపథ్యంలో జీయర్ మాతృమూర్తి మంగతాయారు (85) తన చిన్న కుమారుడి ఇంట్లో అనారోగ్యంతో మృతి చెందారు. అనంతరం భౌతికకాయాన్ని శంషాబాద్ మండలంలోని ముచ్చంతల్ శ్రీరాంనగర్ చినజీయర్ స్వామీజీ ఆశ్రమానికి తరలించారు.
జీయర్ ప్రత్యేక పూజలు..
ఆశ్రమంలో ఆమె పార్థివ దేహానికి చిన్న జీయర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమం సమీపంలో గల జూపల్లి రామేశ్వర్ రావు పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. మైహోం అధినేత రామేశ్వర్ రావు, జగపతిరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఆశ్రమ సమీపంలో పూర్తైన చినజీయర్ మాతృమూర్తి అంత్యక్రియలు ఇవీ చూడండి : చిన్నారుల నుంచి కరోనా సోకే అవకాశం ఎంతంటే?