హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్బీనగర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇంకా వరదలోనే ఆయా ప్రాంతాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు.
వనస్థలిపురం పరిధిలోని శారద నగర్, శాంతి నగర్ కాలనీ, గాంధీ నగర్, విజయపురి కాలనీల రోడ్లపై వర్షపు నీరు చేరింది. హయత్‌నగర్ పరిధిలో రాత్రి కురిసిన వర్షానికి మునగనూర్, తొర్రూర్, బంజారాకాలనీ, అంబేడ్కర్‌నగర్, భగత్ సింగ్ కాలనీలలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఫలితంగా కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
అత్యంత భారీ వర్షసూచన..
రాష్ట్రంలో ఈ రోజు, రేపు.. భారీ నుంచి అతి భారీ, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలుకురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర పరిసర మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు.. ఓ ప్రకటనలో వెల్లడించారు. రుతుపవనాల ద్రోణి ఈ రోజు ఇస్సార్, దిల్లీ, సిధి, బాలంగీర్, కళింగపట్నం మీదుగా తూర్పు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని వివరించారు.
HYDERABAD RAIN EFFECT: రెండు రోజులుగా నీటిలోనే పలు కాలనీలు ఇదీచూడండి:TS WEATHER REPORT: రాగల మూడ్రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.!