Corporator visit Pochampally Road: రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్‌లోని పోచంపల్లి పాతరోడ్డును పునరుద్ధరించాలని డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి కోరారు. ఇవాళ మార్నింగ్‌వాక్‌లో భాగంగా హయత్‌నగర్ పరిధిలోని లక్ష్మీభవాని, శ్రీ సాయినగర్ కాలనీల్లో ఆయన పర్యటించారు.
Corporator visit Pochampally Road: 'పోచంపల్లి పాత రోడ్డును పునరుద్ధరించాలి' - డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి
Corporator visit Pochampally Road: పోచంపల్లి పాత రోడ్డును పునరుద్ధరించాలని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి డిమాండ్ చేశారు. మార్నింగ్ వాక్‌లో భాగంగా హయత్‌నగర్ పరిధిలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించారు.
Mansoorabad corporator: మన్సూరాబాద్ డివిజన్‌లోని కేవీఆర్ గార్డెన్ నుంచి పోచంపల్లి పాతరోడ్డును నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ, రోడ్డు, భవనాలు, రవాణాశాఖ అధికారులు ఈ రహదారిని మూసివేశారని... అధికారులు వెంటనే రహదారిని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు, కాలనీవాసులకు రోడ్డుపై ఉన్న రద్దీని తగ్గించడానికి ఈ రోడ్డును పునరుద్ధరిస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ అప్ప, విజయ్ కుమార్, వనిత, రమేష్, శివ, వికాస్, కొండల్ రెడ్డి, కోటయ్య, కడరి యాదగిరి, సాయి రామ్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: