ఎన్నో ఏళ్లుగా సరైన రహదారులు లేక ఇబ్బందులు పడుతున్న త్యాగరాయనగర్ వాసుల కష్టాలను త్వరలోనే పరిష్కరిస్తానని మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి స్పష్టం చేశారు. కాలనీల్లో సమస్యలపై సంక్షేమసంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కొప్పులను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. త్యాగరాయనగర్, బాలాజీనగర్, శ్రీరామ్‌నగర్ కాలనీల అభివృద్ధిపై అధికారులతో త్వరలోనే విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొంభై శాతం నివాసాలు ఏర్పడినా డ్రైనేజీ, రహదారులు లేకపోవటం గత పాలకుల తప్పిదమన్నారు.
డివిజన్ సమస్యలు పరిష్కరిస్తా: కొప్పుల నరసింహరెడ్డి - మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి
త్యాగరాయనగర్ ప్రజల సమస్యలను ఆర్నెళ్లలో పరిష్కరిస్తానని మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి హామీ ఇచ్చారు. కాలనీల్లో సమస్యలపై సంక్షేమసంఘంతో సమావేశమై విస్తృతంగా పర్యటించారు. కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కాలనీలో పర్యటించిన కొప్పులను త్యాగరాయనగర్ సంక్షేమ సంఘం ఘనంగా సన్మానించింది.
జీహెచ్‌ఎంసీకి అన్ని రకాల పన్నులు వంద శాతం చెల్లిస్తున్నా నిధులు ఇవ్వకపోవటం ఆవేదన కలిగిస్తోందని తెలిపారు. గుంతలు పడిన రహదారులకు మొదట మరమ్మతులు చేపట్టాలని.. కాలనీలో పారిశుద్ధ్యం పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ ట్రంక్‌లైన్ పనులు పూర్తయినందున అంతర్గత లైన్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. డ్రైనేజీ అంతర్గత లైన్లపై జీహెచ్ఎంసీ అధికారులతో ఇప్పటికే చర్చించామని.. త్వరలోనే టెండర్లు పిలుస్తారని ఆయన వెల్లడించారు. కార్పొరేటర్‌తో పాటు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు సతీశ్, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసరావు, సంజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.