హైదరాబాద్ హఫీజ్పేట్కు చెందిన కృష్ణ.. తనను ప్రేమించాలంటూ ఇంటర్ విద్యార్థిని వెంట పడేవాడు. అతని వేధింపులు తాళలేక ఆ యువతి.. తన తల్లిదండ్రులకు చెప్పగా.. తమ కుమార్తె జోలికి రావొద్దని కృష్ణను హెచ్చరించారు. అవేమి పట్టించుకోని కృష్ణ ఆ యువతిని వేధించడం మానలేదు.
యువతిని వేధించిన కేసులో యువకుడికి రెండేళ్ల జైలు శిక్ష - Rangareddy district court
యువతిని వేధించిన కేసులో ఓ యువకుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా కూడా విధిస్తున్నట్లు తెలిపింది.
రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు
ఓ రోజు బస్టాండ్లో ఉన్న యువతి చేయి పట్టుకుని తనను ప్రేమించకుంటే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితునికి రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కోర్టు స్పష్టం చేసింది.