Man Attacked Young Woman with Knife :భాగ్యనగరంలో మహిళలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి. ప్రేమోన్మాది దాడిలో ఎందరో యువతులు బలవుతున్న ఘటనలు పునరావృతమవుతునే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో అటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. చదువు పేరిట సన్నిహితంగా మెలిగి ప్రేమ ముసుగులో వేధించిన ఓ యువకుడు.. యువతిపై కత్తితో దాడికి తెగబడిన ఘాతుక చర్య.. జిల్లాలో సంచలనంగా మారింది.
తనతో క్లోజ్‌గా మెలిగిన యువతి మరో యువకుడితో చనువుగా ఉంటుందని.. అసూయ పెంచుకున్న ఓ వ్యక్తి.. పక్కా ప్రణాళికతో ఇంటికి వెళ్లి మరీ దాడికి పాల్పడ్డాడు. షాద్‌నగర్‌లోని ఓ కాలనీకి చెందిన యువతికి కాలేజీలో(College) చదివే సమయంలో.. ఫరూక్‌నగర్ మండలం పులిచెర్లకుంట గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది.
Attack: కర్రతో యువతిపై దాడి.. స్నేహితుడి కోరిక తీర్చాలంటూ బెదిరింపు
కళాశాల పూర్తయిన తర్వాత ఇద్దరు కొంతకాలం ఒకే షాపులో పనిచేసినట్టు సమాచారం. ఆ తర్వాత యువకుడు షాపులో నుంచి వెళ్లిపోగా.. అమ్మాయి మాత్రం అదే షాపులో పనిచేస్తుంది. అయితే, ఆమెకు ఇష్టం లేకపోయినా ప్రేమించాలని బలవంతం చేస్తూ అతడు వెంటపడేవాడు. ఈ మధ్యకాలంలో దుకాణంలో యువతి తరచూ వేరే యువకుడితో చనువుగా మాట్లాడుతుండటం చూసి అనుమానం పెంచుకున్నాడు. దీంతో పథకం ప్రకారం.. శనివారం(Saturday) కత్తితో యువతి ఇంటికి వెళ్లాడు.