నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని ఓ ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు ప్యాకింగ్ చెస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గత కొంత కాలంగా... పలు బ్రాండ్లకు సంబంధించిన ప్యాకెట్లలో నకిలీ విత్తనాలు నింపి మార్కెట్లకు పంపుతున్నారనే.. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించారు.
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు - నకిలీ పత్తి విత్తనాలు
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 178 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
సుమారు 178 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ దందాను ముగ్గురు వ్యక్తులు నిర్వహిస్తున్నారని...మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలు, బ్రాండ్ల కవర్లు, ప్యాకింగ్ యంత్రాలను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.
- ఇదీ చదవండి:ఆగని కరోనా.. మరో 94 కేసులు నమోదు
Last Updated : Jun 11, 2020, 7:57 AM IST
TAGGED:
నకిలీ పత్తి విత్తనాలు