Mallikarjuna Kharge Release 12 Points SC And ST Declaration : కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(AICC Chief Mallikarjuna Kharge) అన్నారు. ఇక్కడి ప్రజల మనసు తెలుసుకుని సోనియా గాంధీ.. ఆనాడు తెలంగాణ(Telangana) ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేస్తే.. ఆ క్రెడిట్ అంతా ఒకే వ్యక్తి తీసుకున్నారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో కేవీఆర్ మైదానంలో జరిగిన ప్రజాగర్జన బహిరంగ సభలో 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్(SC,ST Declaration) పోస్టర్‌ను మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
"కేసీఆర్.. బయటకు బీజేపీని తిడతారు.. కానీ లోపల మాత్రం మంతనాలు జరుపుతారు. దీని ప్రకారం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ మిత్రపక్షాలే అని అర్థమవుతుంది. తన వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ ఇప్పుడు చెబుతున్నారు. నాడు సోనియాగాంధీతో ఆయన చెప్పిన మాటలు ఏమయ్యాయి. సోనియాతో ఫొటో తీసుకుని బయటకు రాగానే మాట మార్చారు. అలాగే కర్ణాటకలో చెప్పిన హామీలను అధికారంలోకి రాగానే అమలు చేశామని.. తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే 12 అంశాల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను అమలు చేస్తామని" ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు.
Telangana Congress Party Released Campaign Poster : 'తిరగబడదాం- తరిమికొడదాం' నినాదంతో కాంగ్రెస్
12 Points Telangana SC And ST Declaration : 53 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో దేశాన్ని బలోపేతం చేశామని ఖర్గే అన్నారు. మరి దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు దేశానికి ఏం చేశాయని ప్రశ్నించారు. నెహ్రూ, పటేల్ కలిసి చిన్నచిన్న రాజ్యాలను ఏకం చేశాయని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు అనేక సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను ఎవరు నిర్మించారన్నారు. తాము చేసిన పనుల వల్లే ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందని.. ఆహార భద్రత చట్టాన్ని కూడా తెచ్చామని వివరించారు. భూసంస్కరణలు అమలు చేసి జమీందారీ వ్యవస్థను నిషేధించామన్నారు.
Congress Chevella Prajagarjana Sabha : "ఇంకా బ్యాంకులను జాతీయకరణ చేసిన పార్టీ కాంగ్రెస్. హరిత విప్లవం, శ్వేత విప్లవం కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి. ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ ఉందంటే దానికి కారణం రాజీవ్‌గాంధీ ఆనాడు చేసిన కృషే. ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెస్ కాదా.. ప్రజాస్వామ్య దేశం వల్లే తాను కాంగ్రెస్ అధ్యక్షుడిని అయ్యాను. తాము చేపట్టిన కార్యక్రమాల వల్లే మహిళా అక్షరాస్యత 65 శాతమైందని" మల్లికార్జున ఖర్గే చెప్పారు.