రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని పర్వేదలో మల్లన్న జాతర వైభవంగా జరుగుతోంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాలతో ఆద్యంతం సందడిగా మారింది. మహిళలు అలంకరించిన బోనాలతో స్వామి ఆలయానికి బయలు దేరారు.
మల్లన్న స్వామికి బోనమెత్తిన మహిళలు - రంగారెడ్డి జిల్లా నేటి వార్తలు
మల్లన్న జాతర వైభవంగా ప్రారంభమైంది. మహిళలు అలంకరించిన బోనాలతో స్వామి ఆలయానికి బయలు దేరారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాలతో ఆ మార్గం సందడిగా నిలిచింది.
మల్లన్న సామికి.. బోనమెత్తిన మహిళలు
మల్లికార్జున స్వామి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం శివసత్తులు, పోతరాజుల అగ్నిగుండాల ప్రవేశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి :ప్రైవేటు బండి వస్తోంది... రెగ్యులర్ బండి పక్కకు జరపండి!