మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అధికార తెరాస తరఫున మర్రి రాజశేఖర్‌రెడ్డి పోటీ చేయగా... కాంగ్రెస్ నుంచి రేవంత్‌రెడ్డి బరిలో నిలిచారు. భాజపా నుంచి రామచందర్‌రావు పోటీ చేశారు. మినీ భారత్‌గా పిలిచే ఈ నియోజకవర్గంలో గెలుపెవరిదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
మల్కాజిగిరిలో గెలుపెవరిదో...? - ఎన్నికల ఫలితాలు
దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజిగిరి. ప్రధాన పోటీదారులు నియోజకవర్గానికి కొత్త అయినందున పోరు రసవత్తరమైంది. అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఎన్నికల్లో గెలుపెవరిది మరి కాసేపట్లో తేలనుంది.
మల్కాజిగిరిలో గెలుపెవరిదో...?