రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని లింగోజిగూడ డివిజన్లో జరగబోయే ఎన్నికల్లో ఆయా పార్టీలు బహుజనులు లేదా మైనారిటీలకు అవకాశం కల్పించాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బీరకాయల మధుసూదన్ కోరారు. లింగోజిగూడ ఎన్నికల నేపథ్యంలో ఎల్బీనగర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
'లింగోజిగూడ డివిజన్ టికెట్ బహుజనులకే ఇవ్వాలి' - తెలంగాణ వార్తలు
లింగోజిగూడ డివిజన్లో బహుజనులకు టికెట్ ఇవ్వాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బీరకాయల మధుసూదన్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా స్థానికేతరులకు అవకాశం ఇస్తున్నారని ఆరోపించారు.
లింగోజిగూడ డివిజన్ ఎన్నిక, మాలమహానాడు మధుసూదన్
ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న స్థానిక బహుజనులకు అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికేతరులకు టికెట్లు ఇస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల్లో బహుజనులకు అవకాశం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం... భారీగా ఆస్తి నష్టం