తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతి శుక్రవారం హరిత శుక్రవారంగా పాటిద్దాం'

హైదరాబాద్​లో హరిత శుక్రవారం కార్యక్రమం పురస్కరించుకొని పలు రాజకీయ, సీని ప్రముఖులు మొక్కలు నాటారు. గ్రేటర్​లోని 30 సర్కిళ్లలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6 లక్షల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.

'ప్రతి శుక్రవారం హరిత శుక్రవారంగా పాటిద్దాం'

By

Published : Aug 23, 2019, 11:43 PM IST

రాజధానిలో హరితహరం కార్యక్రమం వెల్లువల సాగుతోంది. కార్యక్రమంలో భాగంగా ప్రముఖులు పలు ప్రాంతాలలో మొక్కలు నాటారు. గ్రేటర్​లోని 30 సర్కిళ్లలో నిర్వహించిన హరిత శుక్రవారంలో 6 లక్షల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు ఖాళీ స్థలాల్లో నాటారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్​తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. చందానగర్ సర్కిల్ మియాపూర్​లోని ప్రశాంత్ నగర్​లో నగర మేయర్ రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్ మియాపూర్ గురునాథం చెరువు కట్టపై, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఫీవర్ ఆసుపత్రిలో మొక్కలు నాటారు. ఎల్బీనగర్ శాసన సభ్యులు సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం బండ్లగూడలో 835 మొక్కలను నాటారు. ప్రముఖ సినీ నటుడు నరేష్ జూబ్లిహిల్స్లో నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం హరిత శుక్రవారంగా పాటించి ఉద్యమ రూపంలో మొక్కలను నాటడంతో పాటు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు కమిషనర్ దానకిషోర్ తెలిపారు.

'ప్రతి శుక్రవారం హరిత శుక్రవారంగా పాటిద్దాం'

ABOUT THE AUTHOR

...view details