గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని.. గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, సర్పంచ్ బండారి శైలజా ఆగిరెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పంచాయతీ కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించి గ్రామ సమస్యలపై చర్చించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు ఇంటి పన్ను, నల్లా బిల్లులను కట్టాలని సూచించారు.
ప్రతి ఒక్కరు గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి - mahathma gandhi birthday celebrations at chevell
ప్రతి ఒక్కరు గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, సర్పంచ్ బండారి శైలజా ఆగిరెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం చేవెళ్ల పంచాయతీ కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రతి ఒక్కరు గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి
ఈ కార్యక్రమంలో చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మద్దెల శివనీలచింటు, ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు, కో-అప్షన్ సభ్యులు, పంచాయతి కార్యదర్శి వెంకట్ రెడ్డి, తదితరులు ఉన్నారు.