రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం మునగనూరులోని మాదగోని ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కంపెనీ సీఈవో కృష్ణ మాదగోని హాజరయ్యారు. ఇందిరా పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ సంజీవ్‌రెడ్డి, మలక్‌పేట్ ఏఎస్సై తాజ్ బాబా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సాహితీ టీమ్ విజేతగా నిలవగా.. కంపెనీ సీఈవో బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తమ కంపెనీ అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పని చేస్తోందని ఆయన వివరించారు.
ఇవీ చూడండి..: