రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో ప్రేమజంట ఆత్మహత్య విషాదాన్ని నింపింది. కేశంపేటకు చెందిన యువతి సుశీల అదే గ్రామానికి చెందిన శ్రీరాములు ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడం వల్ల పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు.
ప్రేమను అడ్డుకున్న పెద్దలు..ప్రాణాలు తీసుకున్న ప్రేమికులు.. - రంగారెడ్డి జిల్లా తాజా కబురు
కులాలు వేరు కావడం వల్ల వాళ్ల ప్రేమకు పెద్దలు అడ్డుపడ్డారు. పెద్దలను ఎదిరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. అది తట్టుకోలేక ఆమె ప్రేమికుడు కూడా ఉరివేసుకున్నాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్దలు అడ్డు.. ప్రేమ జంట ఆత్మహత్య
దీనితో మనస్తాపం చెందిన యువతి ఈ రోజు తెల్లవారు జామున ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలుసుకున్న ఆమె ప్రియుడు పొలంలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ప్రేమజంట మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి: నల్గొండలో ప్రైవేటు బస్సుకు మంటలు.. పూర్తిగా దగ్ధం