రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో లోటస్లాప్ పాఠశాలల 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు.
'పిల్లలకు అన్నిరంగాల్లో అవగాహన అవసరం'
పోటీ ప్రపంచంలో అన్నిరంగాలపై విద్యార్థులకు అవగాహన అవసరమని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో లోటస్లాప్ ద్విదశ వార్షికోత్స వేడుకల్లో ఆయన మాట్లాడారు.
'పిల్లలకు అన్ని రంగాల్లో అవగాహన అవసరం'
పోటీ ప్రపంచంలో విద్యార్థులకు చదువుతోపాటు వివిధ అంశాలపై అవగాహన అవసరమని, అన్ని విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పాఠశాలలు కృషి చేయాలన్నారు. లోటస్ లాప్ విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్లాస్టిక్ నియంత్రణ ప్రతిజ్ఞ, స్వామి వివేకానంద నాటిక, వివిధ పాటలకు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి : 'ఆమె ఇద్దరితో ప్రేమాయణం నడిపింది'