తెలంగాణ

telangana

ETV Bharat / state

అబ్దుల్లాపూర్​మెట్​లో లారీ బీభత్సం - rangareddy

ఓ లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో ఈ ఘటన చోటుచేసుకుంది.

బోల్తా పడిన లారీ

By

Published : Aug 22, 2019, 8:40 AM IST

Updated : Aug 22, 2019, 12:59 PM IST

అబ్దుల్లాపూర్​మెట్​లో లారీ బీభత్సం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో ఇవాళ తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్​ నుంచి అబ్దుల్లాపూర్​మెట్ వైపు వస్తున్న లారీ అదుపుతప్పి వాహనాల పైకి దూసుకెళ్లింది. మొదటగా బారీకేడ్లను ఢీకొని అనంతరం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. రోడ్డు పక్కన ఉన్న టీకొట్టును, అక్కడే పార్క్ చేసి ఉన్న నాలుగు కార్లపైకి దూసుకెళ్లి... పల్టీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదు. లారీ డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందా... లేక బ్రేక్​ ఫెయిలైందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Aug 22, 2019, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details