తెలంగాణ

telangana

ETV Bharat / state

'లారీ రుణాల వడ్డీలను ప్రభుత్వమే భరించాలి' - లాక్​డౌన్​లో లారీ యజమానుల డిమాండ్లు

లాక్​డౌన్​ సమయంలో లారీ కిస్తికి సంబంధించి వడ్డీని ప్రభుత్వమే భరించాలని లారీ యజమానుల సంఘం విజ్ఞప్తి చేసింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఆటోనగర్​లో సుమారు 600 మంది రవాణా రంగం, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరకులను అందించారు.

lorry association
'మారటోరియంలో లారీ వడ్డీలను ప్రభుత్వమే భరించాలి'

By

Published : Apr 18, 2020, 3:56 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో లారీలు అడ్డాలకే పరిమితమయ్యాయని లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నందారెడ్డి తెలిపారు. ఈ సమయంలో లారీ కిస్తికి సంబంధించి వడ్డీని ప్రభుత్వమే భరించాలని డిమాండ్​ చేశారు. మారిటోరియం వేళ వడ్డీని ఆర్బీఐ లేక ప్రభుత్వమే భరించాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంరెడ్డి విజ్ఞప్తి చేశారు.

రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఆటోనగర్​లోని లారీల అడ్డా వద్ద తెలంగాణ స్టేట్ లారీ యజమానులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. సుమారు 600 మంది రవాణా రంగ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది రకాల సరకులను అందించారు.

'మారటోరియంలో లారీ వడ్డీలను ప్రభుత్వమే భరించాలి'

ఇవీచూడండి:వైద్యులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు: ఈటల

ABOUT THE AUTHOR

...view details