తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలంతా లాక్​డౌన్​కు సహకరించాలి' - lock down in rajanna sircilla district

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయట తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. ప్రజలంతా లాక్​డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

lock down in sircilla, lock down in sircilla district
సిరిసిల్లలో లాక్​డౌన్, సిరిసిల్లలో లాక్​డౌన్ ఎఫెక్ట్

By

Published : May 13, 2021, 1:13 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్, అంబేడ్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ఎస్పీ రాహుల్ హెగ్డే ఆకస్మిక తనిఖీ చేశారు. పాత బస్టాండ్ ప్రాంతంలో పలు వాహనదారులను అపి తనిఖీ చేసి వారి వివరాలు, బయటకి రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని చెప్పారు.

లాక్​డౌన్​ను రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో కచ్చితంగా అమలు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, మీడియాతో పాటు వ్యవసాయ అనుబంధ సంస్థలకు మాత్రమే లాక్​డౌన్​ నుంచి మినహాయింపు ఉందని తెలిపారు. జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు లాక్​డౌన్ పాటించి పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని ఎస్పీ కోరారు.

ABOUT THE AUTHOR

...view details