ఎల్బీనగర్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌లో ఉప ఎన్నిక ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. డివిజన్‌లో 57 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 47,379 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 1 వరకు 18.26 శాతం పోలింగ్ నమోదైంది.
లింగోజిగూడలో మధ్యాహ్నం 1 వరకు 18.26 శాతం ఓటింగ్ - Lingojiguda election news
లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొవిడ్ నిబంధనల మేరకు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికకు తెరాస దూరంగా ఉంది. మధ్యాహ్నం 1 వరకు 18.26 శాతం ఓటింగ్ నమోదైంది.
![లింగోజిగూడలో మధ్యాహ్నం 1 వరకు 18.26 శాతం ఓటింగ్ lingojiguda-by-election-polling, Lingojiguda news today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11589081-304-11589081-1619760536140.jpg)
లింగోజిగూడలో మధ్యాహ్నం 1 వరకు 18.26 శాతం ఓటింగ్
ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల అధికారులు... కొవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. భాజపా అభ్యర్థి ఆకుల రమేష్ గౌడ్ ఆకస్మిక మరణం కారణంగా జరుగుతున్న ఉప ఎన్నికలకు అధికారులు, పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికకు తెరాస పోటీ నుంచి తప్పుకుంది.
ఇదీ చూడండి:ప్రశాంతంగా కొనసాగుతోన్న మినీ పుర ఎన్నికల ఓటింగ్
Last Updated : Apr 30, 2021, 2:15 PM IST