తెలంగాణ

telangana

ETV Bharat / state

బాబు జగ్జీవన్​రామ్​కు వినతిపత్రం - tsrtc updates

బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ప్రజలు వాపోతున్నారు.

బాబు జగ్జీవన్​రామ్​కు వినతిపత్రం

By

Published : Nov 15, 2019, 4:41 PM IST

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని జబ్బార్​గూడ నుంచి తిమ్మాపురం వరకు ఎటువంటి వాహనాలు తిరగకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లోని విద్యార్థులు సమయానికి బస్సులు రాకపోవడం వల్ల పాఠశాలకు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటు వెళ్లాల్సి వస్తోంది. సాధారణ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదని వాపోతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం బాబు జగ్జీవన్​రామ్​ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

బాబు జగ్జీవన్​రామ్​కు వినతిపత్రం

ఇవి కూడా చదవండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!

ABOUT THE AUTHOR

...view details