రంగారెడ్డిలో మళ్లీ చిరుతపులి కలకలం.. ఆవు దూడను చంపి తిన్న వైనం - telangana news
09:39 January 17
పిల్లిపల్లి శివారులో పొలంలో ఆవు దూడను చంపి తిన్న చిరుత
రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో మళ్లీ చిరుతపులి కలకలం సృష్టించింది. పిల్లిపల్లి శివారులోని పొలంలో ఆవు దూడను పులి చంపి తినేసినట్లు స్థానికులు గుర్తించారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు. బయటకు రావాలంటే భయంగా ఉంటుందని వాపోతున్నారు. అటవీ అధికారులు చిరుతను త్వరగా బంధించాలని కోరుతున్నారు.
ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులి పాదముద్రలు సేకరించారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించారు.
ఇదీ చూడండి:కొంప ముంచుతున్న వాట్సప్ వైద్యాలు.. ఆచరిస్తే అంతే అంటున్న వైద్యులు