రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి, మేడిపల్లి, నందివనపర్తి, తాడిపర్తి అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పశువులు, మేకల మందలపై దాడులకు పాల్పడుతుండటం.. ఆ ప్రాంత రైతుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. శుక్రవారం రాత్రి కొత్తపల్లిలో దామోదర రెడ్డి అనే రైతుకు చెందిన పశువుల మందపై చిరుత దాడి చేసింది. ఒక దూడను పొట్టన పెట్టుకుంది.
పశువులను పొట్టనపెట్టుకుంటున్న చిరుత... భయాందోళలనలో జనం - rangareddy news
అడవుల్లో ఉండాల్సిన చిరుత జనావాసాల్లోకి వచ్చి... పశువులపై దాడి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పలు గ్రామాల్లో సంచారిస్తూ... మేకలు, దూడలను పొట్టనపెట్టుకుంటోంది.
పశువులను పొట్టనపెట్టుకుంటున్న వ్యాఘ్రం... భయాందోళలనలో జనం
చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు గతంలోనే నాలుగు బోన్లు ఏర్పాటు చేసినా... ఫలితం లేకుండా పోయింది. నిత్యం బావుల వద్దకు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. అధికారులు దృష్టి సారించి చిరుత నుంచి తమకు విముక్తి కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు.