రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని రాందాస్పల్లిలో చిరుతపులి కలకలం సృష్టించింది. మాదం బాలరాజు అనే రైతు వ్యవసాయ పొలం వద్ద ఆవుదూడపై దాడి చేసి చంపింది. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత సంచారాన్ని ధ్రువీకరించారు. బోనులు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... అధికారుల నుంచి స్పందన లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆవుదూడను చంపిన చిరుత... భయాందోళనల్లో గ్రామస్థులు - ఆవుదూడపై చిరుత పులి దాడి
ఆవుదూడపై చిరుత దాడి చేసి చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా రాందాస్పల్లిలో చోటుచేసుకుంది. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. బోనులు ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆవుదూడను చంపిన చిరుత... భయాందోళనల్లో గ్రామస్థులు