వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటూ.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. వ్యవసాయ సంఘాలు, విపక్షాలు ఇచ్చిన భారత్ బంద్‌లో భాగంగా సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు.
'నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు అన్యాయం' - bharath band latest updates
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వామపక్ష పార్టీలు భారత్ బంద్ నిర్వహించాయి. బంద్‌లో భాగంగా నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
భారత్ బంద్‌లో వామపక్ష పార్టీలు
ఈ ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం ఈ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:సైరస్ మిస్త్రీ వివాదంలో టాటా సన్స్‌కు ఊరట