తెలంగాణ

telangana

ETV Bharat / state

LB Nagar Murder Case Updates : ఝాన్సమ్మా.. నువ్వు నిజంగా వీరనారివమ్మా.. ఎల్బీనగర్‌ ప్రేమోన్మాది దాడి ఘటనలో ఓ తల్లి తెగింపు - ఎల్బీనగర్‌ మర్డర్‌ కేసులో యువతిని కాపాడిన మహిళ

LB Nagar Murder Case Updates : కళ్ల ముందే దారుణాన్ని చూసి ఆమె భయపడి దాక్కోలేదు. సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తూ.. కనీస బాధ్యతను విస్మరించలేదు. ప్రాణాలు తీస్తున్నాడని తెలిసినా.. తన ప్రాణాలకూ హాని ఉందని అర్థమవుతున్నా.. కిరాతకాన్ని అడ్డుకునేందుకు ఆ క్షణానికి ఆమెలోని ఓ వీరనారి బయటికొచ్చింది. కర్ర పట్టుకుని వెంటపడిన ఆ తల్లి తెగువ, సమయస్ఫూర్తి.. ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టడమే కాకుండా.. అన్యాయంగా నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఓ నరరూప రాక్షసుడిని పోలీసులకు పట్టించింది.

lb nagar jhansi
Lover Attack on Young Woman With Knife in LB Nagar

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 9:26 AM IST

Updated : Sep 4, 2023, 11:43 AM IST

LB Nagar Murder Case Updates ఆ తల్లి తెగువ నిండు ప్రాణాన్ని కాపాడింది ఎల్బీనగర్‌ ప్రేమోన్మాది దాడి ఘటనలో వివాహిత తెగింపు

LB Nagar Murder Case Updates : హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో జరిగిన ప్రేమోన్మాద ఘటనలో దారుణానికి ఒడిగట్టిన శివకుమార్‌ ఓ ప్రాణం తీసి విలన్‌గా మారితే.. భయానక పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఝాన్సీ వీరనారిగా నిలిచింది. ఆర్టీసీ కాలనీలో ఉండే యువతి నివాసంలోకి ప్రవేశించిన ఉన్మాది శివకుమార్‌.. కత్తితో బెదిరింపులకు దిగాడు. యువతిపై దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన ఆమె సోదరుడు పృథ్వీని కత్తితో పొడిచాడు.

Alert Neighbor Rescues Girl From Lover Attack : ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన సంఘవి గట్టిగా కేకలు వేయగా.. పక్కింట్లోనే ఉంటున్న ఝాన్సీ అక్కడికి పరుగులు తీసింది. అప్పటికే కత్తి గాయంతో విలవిల్లాడుతున్న పృథ్వీ.. అక్కపై దాడి జరుగుతున్నట్లు ఆమెకు చెప్పి కిందికి వెళ్లి, పడిపోయాడు. వెంటనే ఝాన్సీ తన ఇంటి నుంచి ఓ కర్రను తీసుకుని బాధిత యువతి గది వద్దకు వెళ్లింది. కిటికీ నుంచి పరిస్థితిని గమనించగా.. అప్పటికే యువతి మరో గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. ఝాన్సీ గట్టిగా కేకలు పెడుతూ కర్రతో తలుపును గట్టిగా బాదుతూ నిందితుడిని హెచ్చరించింది.

LB Nagar Murder Case Updates : నాడు తండ్రినే కడతేర్చాడు..! నేడు మరో ప్రాణం తీశాడు

A Lover Attack on Young Woman With Knife : ఇంట్లోకి చొరబడి ప్రేమోన్మాది దాడి.. తమ్ముడి మృతి, అక్కకు తీవ్ర గాయాలు

Jhansi Saved Young Woman from Lover Attack in LB Nagar : క్షణాల్లో స్థానికంగా ఉండే పది మంది యువకులను అక్కడికి పిలిచి, తలుపులు, కిటికీలు తొలగించిన ఝాన్సీ.. వారిని లోపలికి పంపించింది. అలాగే.. భర్త సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. స్థానికుల రాకతో భయపడిన శివకుమార్‌.. వెనక్కి తగ్గాడు. కానీ, అప్పటికే తీవ్రంగా గాయపడిన సంఘవి సోదరుడు పృథ్వీ ప్రాణాలు కోల్పోయాడు. ఝాన్సీ ఏ మాత్రం భయపడి వెనక్కి తగ్గినా.. సైకో శివకుమార్‌ యువతిని సైతం అంతమొందించేవాడు.

పక్కింట్లో పెద్ద పెద్ద అరుపులు, కిటిటీలు పగిలిన శబ్ధాలు విని నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. అప్పటికే యువతి సోదరుడు తీవ్ర రక్తస్రావంతో మా ఇంటి ముందు నుంచి కిందకు వెళుతున్నాడు. అది చూసి నేను వెంటనే ఇంట్లో ఉన్న కర్ర తీసుకుని అక్కడికి వెళ్లాను. బయటి నుంచి తలుపులు పెట్టి.. అమ్మాయిని ఏం చేయొద్దని నిందితుడిని హెచ్చరించాను. అప్పటికే మా ఆయన, మరో 10 మంది యువకులు చేరుకున్నారు. వారందరి సాయంతో యువతిని చాకచక్యంగా బయటకు తెచ్చాం. నిందితుడిని లోపలే బంధించి.. పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఈలోపు యువతిని ఆసుపత్రికి తరలించాం. పోలీసులు వచ్చి ఇంట్లో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. - ఝాన్సీ, ప్రత్యక్ష సాక్షి

అర్ధరాత్రి ఇంట్లో చొరబడి.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

ఏదైనా దారుణం జరుగుతున్నా.. ఎవరైనా ఆపదలో ఉన్నా.. తమకెందుకులే అనుకోవటం, ప్రాణాలు పోతున్నా సరే సెల్‌ఫోన్లలో వీడియోలు తీసుకుంటున్న నేటి రోజుల్లో ఝాన్సీ ప్రాణాలకు తెగించి చూపించిన తెగువ నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచింది.

A Lover Attacked With Knife Young Woman : జగద్గిరిగుట్టలో యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి

ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. అసలేం జరిగిందంటే?

Last Updated : Sep 4, 2023, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details