తెలంగాణ

telangana

ETV Bharat / state

Krishnaveni Hospital: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి: సుధీర్ రెడ్డి - హయత్‌నగర్‌లో క్రిష్ణవేణి ఆస్పత్రి

Krishnaveni Hospital: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. హయత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన కృష్ణవేణి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు.

Krishnaveni Hospital
కృష్ణవేణి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి

By

Published : May 16, 2022, 5:12 AM IST

Krishnaveni Hospital: ప్రజలందరికీ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన కృష్ణవేణి మల్టీ స్పషాలిటీ ఆస్పత్రి భవనాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కృష్ణవేణి ఆస్పత్రి వైద్యులు చాలా రోజులుగా హయత్ నగర్ పరిధిలో ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తున్నారని వారి సేవలను కొనియాడారు.

ఇక నుంచి అన్ని అత్యాధునిక పరికరాలతో స్థాపించిన ఈ నూతన ఆస్పత్రి ద్వారా కూడా ప్రజలకి అందరికీ వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. అధునాతన సాంకేతిక వైద్య సదుపాయాలతో అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ఆస్పత్రి సిద్ధంగా ఉందని ఎండీ డాక్టర్ ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details