రాష్ట్ర ప్రభుత్వం అభ్కారీ శాఖ అధ్వర్యంలో హైదరాబాద్ నాగోల్‌లో లాటరీ ద్వారా 2021కి నూతన బార్లను ఎంపిక చేశారు. దరఖాస్తుదారులు భారీగా హాజరయ్యారు. 55 బార్లకుగాను 1,338 అప్లికేషన్లు వచ్చాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో బార్ల కోసం భారీగా దరఖాస్తుదారులు - telangana news today
జీహెచ్ఎంసీ పరిధిలో 2021 ఏడాదికి కొత్త బార్లను ఎంపిక చేశారు. 55 బార్లకు గాను మొత్తం 1,338 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

బార్ల కోసం భారీగా వచ్చిన దరఖాస్తుదారులు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంఛార్జీ ఎక్సైజ్ కమిషనర్ నీతూప్రసాద్, జాయింట్ కమిషనర్ అజయ్‌రావు హాజరయ్యారు. లాటరీ ద్వారా 55 బార్ల లబ్దిదారులను ఎంపిక చేశారు. ఆ బార్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి :న్యాయవాదుల నిరసనలో ఉద్రిక్తత.. లాయర్‌పై వ్యక్తి దాడి