తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.8.35 లక్షలు పలికిన లడ్డూ ధర.. దక్కించుకున్న తుడి శ్రీనివాస్ రెడ్డి - లడ్డు వేలం పాట తాజా వార్తలు

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలోని వాసవి శ్రీ నిలయంలో వినాయకుడి లడ్డూ వేలం పాట నిర్వహించారు. లడ్డూ ధర రికార్డు స్థాయిలో రూ.8.35 లక్షలు పలుకగా.. వ్యాపారవేత్త తుడి శ్రీనివాస్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.

లడ్డూ వేలంపాట
లడ్డూ వేలంపాట

By

Published : Sep 10, 2022, 3:28 PM IST

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలోని చింతల్​కుంటలో వాసవి శ్రీ నిలయంలో వినాయకుడి లడ్డూ వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో పాల్గొన్న వ్యాపారవేత్త తుడి శ్రీనివాస్ రెడ్డి.. రికార్డు స్థాయి ధర రూ.8.35 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. హోరాహోరీగా జరిగిన వేలం పాటలో తాడిశెట్టి దయాకర్ పాల్గొనగా.. చివరగా తుడి శ్రీనివాస్ రెడ్డి అత్యధిక ధరతో వేలంలో లడ్డూను గెలుచుకున్నారు.

వినాయకుడి ఆశీస్సుల వల్లే తాను లడ్డూ పొందగలిగానని తుడి శ్రీనివాస్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరిపై ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details