తెలంగాణ

telangana

ETV Bharat / state

నేలపైనే బాలింతలు.. - చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి

ప్రభుత్వ ఆస్పత్రులు అసౌకర్యాలకు నిలయంగా మారుతున్నాయి. చేవెళ్లలో కు.ని శస్త్ర చికిత్సలకు వచ్చిన బాలింతలకు సరైన సౌకర్యాలు కల్పించక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వైద్యుల నిర్లక్ష్యం

By

Published : Feb 15, 2019, 8:40 PM IST

సౌకర్యాలు లేమితో బాలింతలు బాధలు
ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు. కటిక నేలపైనే బాలింతలు..రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో కనిపించిన దృశ్యాలివి. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసుకున్న బాలింతల పరిస్థితి వర్ణణాతీతం. బాధితులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు.
శుక్రవారం ఒక్కరోజే 140 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేశారు. కేవలం 30 మంచాలు మాత్రమే అందుబాటులో ఉండగా... అవీ ఇద్దరి, ముగ్గురు చొప్పున 60 మందికి కేటాయించారు. మిగతావారిని నేలపైనే పడుకోబెట్టారు. నొప్పి భరించలేక బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రతి రెండేళ్లకోసారి ఇక్కడ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని, సరైన ఏర్పాట్లు చేసుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని వాపోతున్నారు. ఇప్పటికైనా వైద్యశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.



ABOUT THE AUTHOR

...view details