రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం షాబాద్‌లోని చందనవెల్లి పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ బయలు దేరారు. మెయినాబాద్ అఖిలపక్షం నాయకులందరూ కలిసి జీవో 111ను తొలగించాలని కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునే యత్నం - akhila paksham leaders stopped minister ktr convoy
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలకేంద్రంలో తెరాస జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం షాబాద్‌కు వెళ్తుండగా.. జీవో 111ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు మొయినాబాద్ అఖిలపక్ష నేతలు ప్రయత్నించారు.

కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన అఖిలపక్షం
అంతకుముందు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలకేంద్రంలోని హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై తెరాస పార్టీ జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిఃకొవిడ్ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే