Ktr comments on BJP: రాష్ట్రంలో గీత కార్మికులకు త్వరలో మోపేడ్‌లు అందిస్తామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. భాజపా అధికారంలో ఉన్న కర్ణాటకలో... కల్లు గీయడాన్ని నిషేధిస్తూ జీవో ఇచ్చారని గుర్తు చేశారు. రంగారెడ్ది జిల్లా మన్నెగూడలో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్, గౌడ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బీసీ బంధు పెట్టాలంటున్న భాజపా.. తొలుత కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు బీమా మాదిరిగా గీతకార్మికుల బీమా ఇచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
'రాష్ట్రంలో 2014 ముందు విద్యుత్‌కు ఇబ్బంది ఉండేది. ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ సమస్య పూర్తిగా పోయింది. నల్గొండ జిల్లాలో తీవ్ర నీటి ఇబ్బంది ఉండేది. రైతులు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ప్రాంతంలోని కుల వృత్తులను ఆదుకుంటున్నాం. గీత కార్మికులకు త్వరలో మోపేడ్‌లు అందిస్తాం. కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ పెట్టండి.' -కేటీఆర్, పురపాలకశాఖ మంత్రి