రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మేకనిగడ్డలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ గోశాలలో సచ్చిదానంద యోగ మిషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోమాత అష్టలక్ష్మి స్వరూపమని, గో ఆధారిత సేద్యమే అన్ని ఐశ్వర్యాలకు మూలమని సాధ్వి నిర్మలానంద యోగ భారతి అన్నారు. కార్యక్రమంలో సచ్చిదానంద యోగ మిషన్, గోశాల సభ్యులు, రైతులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రాచీన సంస్కృతి, యోగ, జీవన విధానంపై సాధ్వి ప్రవచనాలు చెప్పారు. గో సేద్యంతో ఆరోగ్యకరమైన ఆహారం పొందడమే కాకుండా ప్రకృతి విధ్వంసం నుంచి భూగోళం, పర్యావరణం, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవచ్చని మాతాజీ పేర్కొన్నారు.
గో ఆధారిత సేద్యం చేయాలి:సాధ్వి నిర్మలానంద - సచ్చిదానంద యోగ మిషన్
రంగారెడ్డి జిల్లాలోని శ్రీవేణుగోపాల స్వామి మందిర గోశాల ప్రాంగణంలో సచ్చిదానంద యోగ మిషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోమాత అష్టలక్ష్మి అని సాధ్వి నిర్మలానంద యోగ భారతి అన్నారు.
![గో ఆధారిత సేద్యం చేయాలి:సాధ్వి నిర్మలానంద](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4237099-263-4237099-1566715760411.jpg)
గో ఆధారిత సేద్యం చేయాలి:సాధ్వి నిర్మలానంద