రంగారెడ్డి జిల్లా కొత్తూర్ పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓటర్లు ఓటు వేయడానికి ఒక్కసారిగా తరలిరావడం వల్ల ఆయా పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో నిండిపోయాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు ఆరోగ్య సిబ్బంది థర్మల్ స్కానింగ్ చేసి, శానిటైజర్ అందజేశారు.
ప్రశాంతంగా కొత్తూరు పురపాలిక తొలి పోలింగ్ - kothuru municipal election polling
రంగారెడ్డి జిల్లా కొత్తూరు, తిమ్మాపూర్ గ్రామపంచాయతీలను కలుపుతూ నూతనంగా ఏర్పాటు చేసిన కొత్తూరు పురపాలిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓవైపు కరోనా.. మరోవైపు మండే ఎండలతో ప్రజలు ఓటు వేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపలేదు.
కొత్తూరు పురపాలక ఎన్నిక, కొత్తూరు పురపాలక ఎన్నికల పోలింగ్, రంగారెడ్డి జిల్లా వార్తలు
కొత్తూర్ జడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రాన్ని శంషాబాద్ ఏసీపీ ప్రకాశ్ రెడ్డి సందర్శించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ జరుగుతుందో లేదో పరిశీలించారు. ఓవైపు కరోనా.. మరోవైపు ఎండ వేడిమి వల్ల ఓటు వేయడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపలేదు. మధ్యాహ్నం మధ్యాహ్నం 3 గంటల వరకు 76.79 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల ప్రత్యేక అధికారిణి జ్యోతి తెలిపారు.
- ఇదీ చదవండి:కరోనా కాలంలో చేయాల్సినవి.. చేయకూడనివి..