తెలంగాణ

telangana

ETV Bharat / state

నాయకుడంటే దోచుకోవడం కాదు... - komatireddy venkat reddy

నాయకుడు అంటే దోచుకోవడం కాదు... చనిపోయిన తర్వాత కూడా ప్రజలకు గుర్తుండిపోయేలా పనులు చేయాలన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కర్మన్​ఘాట్​లోని ఓ గార్డెన్స్​లో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వెంకట్​ రెడ్డి

By

Published : Jun 2, 2019, 5:02 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేల కోట్లు దోచుకుంటున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కర్మన్​ఘాట్​లోని ఓ గార్డెన్స్​లో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయకుడు అంటే అందినకాడికి దోచుకోవడం కాదు... చనిపోయిన తరువాత కూడా ప్రజల మనసులో స్థిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

నాయకుడంటే దోచుకోవడం కాదు...

ABOUT THE AUTHOR

...view details