తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలోని టోర్నీలో... కోహెడ జట్టు విజయం - కోహెడ క్రికెట్ జట్టు

ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న టోర్నీలో కోహెడ జట్టు విజయం సాధించింది. రెండోస్థానంలో పటేల్ గూడ జట్టు నిలిచింది. విజేతలకు స్థానిక నేతలు నగదుతో పాటు ట్రోఫీని అందించారు.

koheda-team-wins-the-tournament-in-ibrahimpatnam
ఇబ్రహీంపట్నంలోని టోర్నీలో... కోహెడ జట్టు విజయం

By

Published : Apr 19, 2021, 11:05 AM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీ ఆదివారంతో ముగిసింది. ఈ టోర్నీలో మొత్తం 40 టీంలు పాల్గొనగా ఫైనల్​లో కోహెడ జట్టు విజయం సాధించింది. సెకండ్ ప్లేస్​లో పటేల్ గూడ జట్టు నిలిచింది.

టోర్నీలో ఫైనల్ మ్యాచ్ నువ్వా నేనా అనే విధంగా రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్​లో మొదటి స్థానంలో నిలిచిన కోహెడ జట్టు ట్రోఫీతో పాటు లక్ష రూపాయల బహుమతిని గెలుచుకుంది. సెకండ్ ప్లేస్​లో నిలిచిన టీమ్​కు నిర్వాహకులు ట్రోఫితో పాటు రూ.50వేలు అందించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్​ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు దండెం రాంరెడ్డి ఇతర స్థానిక కౌన్సిలర్​లు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచే యువత క్రీడల్లో ముందుండాలని... అలాంటివారికి తమ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని వక్తలు తెలిపారు.

ఇదీ చూడండి:పురోహిత్​ క్రికెట్ లీగ్... పంతుళ్లకు మాత్రమే...!

ABOUT THE AUTHOR

...view details