ఆధునిక పోకడలతో రోడ్లపై దొరికే ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధుల బారినపడుతున్నామని.. తినే ఆహారం సరైనదయితే ఏ మందు అవసరం లేదని ప్రఖ్యాత స్వతంత్ర్య శాస్త్రవేత్త ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌వలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామశివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో నిర్వహించిన అమృత ఆహారం కార్యక్రమానికి ఆయన హాజరై సిరిధాన్యాలు, కషాయాలు, కట్టె గానుగ నూనెలపై అవగాహన కల్పించారు.
సిరిధాన్యాలతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది: డా. ఖాదర్‌వలీ - ఖాదర్‌వలీ అమృత ఆహారం కార్యక్రమం
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామశివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో నిర్వహించిన అమృత ఆహారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రఖ్యాత ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌వలీ హాజరయ్యారు. కార్యక్రమంలో సిరిధాన్యాలు, కషాయాలు, కట్టె గానుగ నూనెలను వాడుతూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై అవగాహన కల్పించారు.
సంపూర్ణ ఆరోగ్య జీవనానికి పూర్వీకులు మనకు నేర్పిన ఆహారాన్ని మరచి విదేశీ అలవాట్లతో రోగాలను కొనుక్కు తెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రకృతి ప్రసాదించిన వనమూలికలను వదిలేసి ఆరోగ్యాన్ని చెడగొట్టే పదార్థాలను తీసుకోవడం వల్ల జీవన విధానం మారుతోందన్నారు. 12 రోజులపాటు నిత్యం గరిక తిప్పతీగ, గానుగ కషాయాలు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని ఖాదర్‌వలీ తెలిపారు. అమృత ఆహారం కార్యక్రమం ద్వారా వేల మందికి రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఖాదర్‌వలీ వివరించారు.
ఇదీ చదవండిఃదేశంలో 66 లక్షలు దాటిన కరోనా కేసులు