రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లోని పద్మ నర్సింగ్ హోమ్‌ను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి సీజ్ చేశారు. హైదరాబాద్ మునగనూర్ శివారులో కన్న తల్లిని హత్య చేసిన కీర్తి.. పద్మ నర్సింగ్ హోమ్‌లో అబార్షన్ చేయించుకున్నట్లు విచారణలో తేలింది. అబార్షన్ చేసినట్లు రుజువైతే తదుపరి చర్యలు తీసుకుంటామని, సరైన గుర్తింపు లేకుండా వైద్య పరీక్షలు, అబార్షన్లు చేయడం నేరమని రంగారెడ్డి జిల్లా వైద్య అధికారిని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి సూచించారు. అనుమతులు లేకుండా చిన్న చిన్న ఆసుపత్రులు నడిపిస్తున్న వ్యక్తులపైనా.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కీర్తిరెడ్డి అబార్షన్ చేయించుకున్న నర్సింగ్‌హోమ్ సీజ్ - పద్మ నర్సింగ్‌హోమ్ సీజ్
కన్నతల్లిని హతమార్చి.. కటకటలా పాలైన కీర్తిరెడ్డి అబార్షన్ చేయించుకున్న రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లోని పద్మ నర్సింగ్ హోమ్‌ను వైద్యాధికారులు సీజ్ చేశారు. విచారణలో నిజం తేలితే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

నర్సింగ్‌హోమ్ సీజ్