రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తహసీల్దారు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి అర్హులకు చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా మరే ఇతర రాష్ట్రంలోను అమలు కావడంలేదని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్తోమత పెరిగితే కల్యాణ లక్ష్మి మొత్తాన్ని రూ. లక్షా 25 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కిషన్రెడ్డి - shadi mubharak
అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగింది. 32మంది లబ్ధిదారులకు కల్యాణలక్మి, షాదిముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పంపిణీ చేశారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ