తెలంగాణ

telangana

ETV Bharat / state

కబ్జాకోరులు ఆక్రమించుకున్నారు... కాపాడండి సారూ! - telangana varthalu

నందనవనంలో తమకు కేటాయించిన ఇళ్లను కబ్జాదారుల నుంచి రక్షించి తమకు కేటాయించాలని లబ్ధిదారులు రంగారెడ్డి కలెక్టరేట్​ ఎదుట ఆందోళనకు దిగారు. డబ్బులు కట్టి 16 ఏళ్లు గడిచినా ఇంతవరకు ఇళ్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కబ్జాదారులు ఆక్రమించుకున్నారు... కాపాడండి సారూ!
కబ్జాదారులు ఆక్రమించుకున్నారు... కాపాడండి సారూ!

By

Published : Feb 1, 2021, 3:34 PM IST

రంగారెడ్డి జిల్లా కర్మన్​ఘాట్​లోని నందనవనంలో తమకు కేటాయించిన ఇళ్లకు కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ... లబ్ధిదారులు లక్డీకాపూల్​లోని రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. జేఎన్​ఎన్​యూఆర్​ఎం గృహ నిర్మాణ పథకం కింద ఒక్కొక్క లబ్ధిదారుడి నుంచి రూ.80, 250 తీసుకొని 512 మందికి ఇళ్లు కేటాయించారని బాధిత లబ్ధిదారులు తెలిపారు. తమ ఆడవాళ్ల మెడలో నుంచి బంగారు ఆభరణాలు అమ్మి ఇళ్ల కోసం డబ్బులు చెల్లించామని... 16 ఏళ్లు గడిచినా ఇంత వరకు ఇళ్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తమకు కేటాయించిన ఇళ్ల తాళాలు పగులగొట్టి కబ్జాదారులు ఆక్రమించుకున్నారని... దీనిపై వారిని అడిగితే తమపై దౌర్జన్యాలకు పాలుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారని... ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని కబ్జాదారులు వేడుకున్నారు.

ఇదీ చదవండి: పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్​

ABOUT THE AUTHOR

...view details