తెలంగాణ

telangana

ETV Bharat / state

Pawan Kalyan Visit Samathamurthi Statue: సమతామూర్తి క్షేత్రాన్ని సందర్శించిన పవన్​కల్యాణ్​ - రంగారెడ్డి వార్తలు

Pawan Kalyan Visit Samathamurthi Statue: వెయ్యేళ్లక్రితమే సమాజానికి ఐక్యతా, సమానత్వ స్ఫూర్తిని అందించిన రామానుజుల విగ్రహాన్ని భాగ్యనగరంలో నెలకొల్పడం అద్భుతమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో సమతామూర్తి కేంద్రాన్ని పవన్‌ కల్యాణ్‌ సందర్శించారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహం, 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. భావితరాలకు రామానుజాచార్యుల వారి సిద్ధాంతాలు ఆదర్శం, అనుసరణీయమని కొనియాడారు.

Sambanthamurthi Statue
Pawan Kalyan Visit Sambanthamurthi Statue

By

Published : Feb 6, 2022, 10:33 PM IST

సమతామూర్తి క్షేత్రాన్ని సందర్శించిన పవన్​కల్యాణ్​

Pawan Kalyan Visit Samathamurthi Statue: భిన్న మతాలు, కులాలు, సంస్కృతులకు సమతామూర్తి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్​ అన్నారు. ముచ్చింతల్​లో చిన్నజీయర్ స్వామి ఏర్పాటు చేసిన సమతామూర్తి కేంద్రాన్ని పవన్​ కల్యాణ్​ సందర్శించారు. సమతామూర్తి విగ్రహం ప్రాంగణం, యాగశాలను వీక్షించారు.

అనంతరం ప్రవచన మండపంలో చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సమతామూర్తి విశేషాలను చినజీయర్ స్వామి పవన్​కు వివరించారు. భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన పవన్ కల్యాణ్​... సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన దేశ ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చిన్నజీయర్ స్వామి సంకల్పంతో 216 అడుగుల భారీ విగ్రహంతో పాటు 108 దేవాలయాలను ఏర్పాటు చేయడం భాగ్యనగరానికి సరికొత్త గుర్తింపునిస్తుందన్నారు. రామానుజాచార్యులు జగద్గురువే కాకుండా అణగారిని వర్గాలను ఆలయ ప్రవేశం చేయించిన విప్లవకారుడని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:Medaram Arrangements : వనదేవతల జాతరకు పటిష్ఠ ఏర్పాట్లు : సత్యవతి రాఠోడ్

ABOUT THE AUTHOR

...view details