పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని.. వాటితో పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ అభిప్రాయాలు, నిర్ణయాలను పార్టీ అధికార పత్రం ద్వారా, పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని పవన్ కోరారు. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని.. ఈ తరుణంలో మనం ప్రజాసేవ తప్ప మరే.. అంశాల జోలికి వెళ్లవద్దని కోరారు. క్రమశిక్షణను అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు: పవన్ - నాగబాబుపై జనసేన పార్టీ నేతల ఫైర్ న్యూస్
నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో జనసేనకు సంబంధం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. సున్నిత అంశాలపై పార్టీకి చెందినవారు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని.. వ్యక్తిగత భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు.
నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు: పవన్