తెలంగాణ

telangana

ETV Bharat / state

Jalpally Municipal Commissioner: బాధితులతో మమేకమై.. వారి సమస్యలు విన్న కమిషనర్ - జల్పల్లి మున్సిపల్ కమిషనర్ తాజా వార్తలు

Jalpally Municipal Commissioner: మున్సిపాలిటీలో తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగితే కానీ పనులు పూర్తవని రోజులివి. అలాంటిది కమిషనర్ వచ్చి సామాన్య వ్యక్తిలా మారి వారి కష్టాలు తీరుస్తానని హామీ ఇవ్వడం లాంటివి అరుదుగా జరుగుతుంటాయి. ఈ సంఘటనే జల్​పల్లి మున్సిపాలిటీలో చోటుచేసుకుంది.

Commissioner sitting on the floor listening to the victims' problems
బాధితుల సమస్యలు వినేందుకు నేలపై కూర్చున్న కమిషనర్

By

Published : Mar 12, 2022, 4:00 PM IST

Updated : Mar 12, 2022, 5:26 PM IST

Jalpally Municipal Commissioner: రంగారెడ్డి జిల్లా జల్​పల్లిలోని శ్రీరామ కాలనీ 20వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని దాదాపు 50 మంది మహిళలు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కుర్చీలపై కొందరు మరికొందరు నేలపై కూర్చొని కమిషనర్ కోసం వేచి ఉన్నారు.

సమస్యలు వింటున్న కమిషనర్

ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ జీపీ కుమార్ వెంటనే తన గది నుంచి బయటకు వచ్చి వారితో ఒక సామాన్య వ్యక్తిగా నేలమీద కూర్చొని వారితో చర్చించారు. ముందుగా మంచినీరు, టీ అందించి తరువాత వారి సమస్యలు విన్నారు. వెంటనే నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఫోన్​లో వారి సమస్యలను వివరించారు. అనంతరం త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.

కార్యాలయానికి వచ్చిన మహిళలు సమస్యలు మర్చిపోయి కమిషనర్ జీపీ కుమార్ మమేకమైన తీరును చూసి ఆనందంతో పొంగిపోయారు. కమిషనర్​గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జీపీ కుమార్ పాలనలో తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా గత వర్షాకాలంలో భారీవర్షాలకు కాలనీల్లో వరదముంపు ఏర్పడినప్పుడు అక్కడే ఉండి సమస్యను పరిష్కరించి అందరి మన్ననలు పొందారు.

ఇదీ చదవండి: CJI Justice NV Ramana About IAMC : 'హైదరాబాద్‌ ఐఏఎంసీ ప్రపంచ ఖ్యాతి పొందాలి'

Last Updated : Mar 12, 2022, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details