జంతు కళేబరాల పరిశ్రమలపై జల్పల్లి పురపాలక కమిషనర్ జీపీ కుమార్ ఉక్కుపాదం మోపారు. సరైన అనుమతులు, ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్న పరిశ్రమలపై దాడులు నిర్వహించారు. స్థానిక షాజహాన్ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమలు నడుపుతున్నట్లు గుర్తించారు.
జంతు కళేబరాల గోడౌన్ల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు - rangareddy dist news
జంతు కళేబరాల పరిశ్రమలపై జల్పల్లి పురపాలక కమిషనర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేకుండా నడుపుతున్న పరిశ్రమలను ఆయన సీజ్ చేశారు.
జల్పల్లి పురపాలికలో మున్సిపల్ కమిషనర్ దాడులు
ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పశువుల అవయవాలను ఎండబెట్టి, కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేస్తున్నారు. మాంసపు నిల్వలపై ప్యాకింగ్ తేదీలు నెల ముందుగానే ముద్రించి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తనిఖీల్లో సరైన ప్రమాణాలు పాటించని ఐదు గోడౌన్లపై చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు.