రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో తెరాస, ఎంఐఎం, తెరాస రెబల్, స్వతంత్ర అభ్యర్థులు కో ఆప్షన్ మెంబర్ కోసం తమ నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం వరకు 7 నామినేషన్లు వచ్చాయి. ఈ రోజు నామినేషన్ ఆఖరి తేదీ కావడం వల్ల మున్సిపల్ కార్యాలయం వివిధ పార్టీ నేతలతో సందడిగా మారింది.
జల్పల్లి కో ఆప్షన్ పదవికై తెరాస రెబల్ హెచ్చరిక - రంగారెడ్డి జిల్లాతాజా వార్త
రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలో కో ఆప్షన్ పదవి ఇవ్వకపోతే పరిణామాలు వేరే ఉంటాయని తెరాస రెబల్ అభ్యర్థి జహంగీర్ హెచ్చరించారు. కాగా ఈ రోజు ఆఖరి తేదీ కావడం వల్ల సాయంత్రం వరకు వచ్చిన నామినేషన్లను పరిశీలించి స్క్రుటినీ చేస్తామని మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సఫీఉల్లాహ్ తెలిపారు.
జల్పల్లి కో ఆప్షన్ పదవికై తెరాస రెబల్ హెచ్చరిక
తాను జల్పల్లి మున్సిపాలిటీలో అందరికంటే సీనియర్ నేతనని తనకి కౌన్సిలర్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదని.. ఇప్పుడు కో-ఆప్షన్ ఇవ్వకపోతే పరిమాణాలు వేరుగా ఉంటాయని తెరాస రెబల్ షేక్ జహంగీర్ హెచ్చరించారు. అతనికి జల్పల్లి తెరాస కౌన్సిలర్ మద్దతు తెలిపారు. నామినేషన్లను పరిశీలించి వాటిని మూడు రోజుల్లో స్ర్కుటిని చేస్తామని మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సఫీఉల్లాహ్ తెలిపారు.