రంగారెడ్డి జిల్లా జల్పల్లి పురపాలకలో అన్ని వార్డుల్లో ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తున్న ఆస్తుల వివరాల ప్రక్రియపై.. మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
'ధరణి' సర్వేకు సహకరించాలి: మున్సిపల్ కమిషనర్ - Rangareddy District Latest News
రంగారెడ్డి జిల్లాలో ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తున్న ఆస్తుల వివరాల ప్రక్రియపై.. మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్... ఆకస్మిక తనిఖీలు చేశారు. ధరణి సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.
ధరణిలో వివరాలు నమోదు చేసుకుంటున్న వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బందికి ఎలాంటి పత్రాలు ఇవ్వద్దని.. ఒక ఫోటో, ఆధార్ నంబర్ ఇచ్చి మిగతా వివరాలు ఇస్తే చాలు అని చెప్పారు. సిబ్బంది ఏమైనా నిర్లక్ష్యం చేసినా.. పత్రాలు అడిగినా.. ఏమైనా అపోహలు ఉన్నా.. నేరుగా తనని సంప్రదించాలని ప్రజలకు మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ కోరారు.
కొన్ని ముస్లిం మైనారిటీ వార్డుల్లో ఆస్తుల వివరాలు సేకరించడానికి వచ్చిన సిబ్బందికి సహకారం కరువైంది. ఇప్పటివరకు జల్పల్లి మున్సిపాలిటీలో 5600 ఆస్తుల వివరాలు నమోదయ్యాయి. అపోహలు వద్దు.. ఆస్తుల నమోదు కొరకే ధరణి పోర్టల్ అని కమిషనర్ తెలిపారు.