వర్షాలకు అతలాకుతలమైన జల్పల్లి ప్రాంతంలో బాధితులకు అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టామని పురపాలక కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండి.. అహర్నిశలు కష్టపడ్డామని వెల్లడించారు. బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందనడం సరికాదన్నారు.
ప్రభుత్వం విఫలమైందనడం సరికాదు: కుమార్ - rangareddy district latest news
జల్పల్లి ప్రాంతంలో వరద బాధితులకు అన్ని సహాయక చర్యలు చేపట్టామని పురపాలక కమిషనర్ కుమార్ వెల్లడించారు. బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందనడం సరికాదన్నారు.
ప్రభుత్వం విఫలమైందనడం సరికాదు: కుమార్
ఈ సందర్భంగా బురాన్ఖాన్ చెరువు పరిధి ఎఫ్టీఎల్లో నిర్మించుకున్న ఇళ్లల్లోకి నీరు చేరిందని తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ సహకారంతో బాధితులకు సదుపాయాలను అందించామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి