రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పీస్ పరిధిలోని రాయల్‌కాలనీ మేఘ ఫంక్షన్ హల్లో జరగాల్సిన విచారణ ఆధార్ శాఖ రద్దు చేసుకుంది. తప్పుడు ఆధారాలు సమర్పించి, ఆధార్ కార్డు పొందారని 127 మందికి ఆధార్ సంస్థ గతంలో నోటీసులు పంపించింది. వారు సరైన ఆధారాలతో ఇవాళ హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వచ్చిన అభ్యర్థులు ఫంక్షన్‌హాల్ గోడపై కార్యక్రమం రద్దు నోటీస్ చూసి వెనుతిరిగారు.
ఆ 127మందిపై విచారణ వాయిదా వేసిన ఆధార్ సంస్థ - rangareddy district latest news
తప్పుడు ఆధారాలతో ఆధార్ పొందిన 127 మందిపై విచారణ వాయిదా పడింది. ఇవాళ 127 మంది హాజరుకావాలని నోటీసులు ఇచ్చినా.. చివరిక్షణంలో నిలిపివేశారు. విషయం తెలియక వచ్చిన అభ్యర్థులు... తమకు సమావేశం రద్దు గురించి ఎలాంటి సమాచారం లేదని వాపోతున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో జరిగింది.
నోటీసులు జారీ.. వాయిదా వేసిన ఆధార్ సంస్థ
ఈరోజు జరగాల్సిన విచారణ కార్యక్రమం రద్దు గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని అభ్యర్థులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జాతీయత నిరూపించమని అడిగే హక్కు ఆధార్ శాఖకు లేదని బాధితుడు సత్తార్ ఖాన్ తరుపు న్యాయవాది సోహైల్ మాలిక్ అన్నారు. గతంలో ఈ కేసుపై పలువురు జైలుకు కూడా వెళ్లి వచ్చామన్నారు.
ఇదీ చూడండి :శివరాత్రి శోభకు చకచక ఏర్పాట్లు