తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్ధార్థ ఆసుపత్రికి ఐఎస్‌వో అంతర్జాతీయ అవార్డు - rangareddy district latest news

మదీనాగూడలోని సిద్ధార్థ ఆసుపత్రికి ఐఎస్‌వో అంతర్జాతీయ అవార్డు లభించింది. రోగులకు అత్యాధునిక వైద్య సేవలందించడం, నాణ్యతా ప్రమాణాలు పాటించడంతోనే ఈ గుర్తింపు లభించిందని ఆసుపత్రి యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

ISO International Award for Siddhartha Hospital
సిద్ధార్థ ఆసుపత్రికి ఐఎస్‌వో అంతర్జాతీయ అవార్డు

By

Published : Feb 24, 2021, 8:19 PM IST

రంగారెడ్డి జిల్లా మదీనాగూడలోని సిద్ధార్థ ఆసుపత్రికి ఐఎస్‌వో అంతర్జాతీయ అవార్డు లభించింది. అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తుంన్నందుకు ఈ అవార్డు వరించినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

ఐఎస్‌వో ప్రామాణిక పత్రం పొందేందుకు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవడమే కాక.. పలుమార్లు ప్రమాణాలను తనిఖీ చేసి, సంతృప్తి చెందిన తర్వాతే జారీ చేస్తారని సిద్ధార్థ హాస్పిటల్ పాలనాధికారి టి.శ్రీకాంత్ తెలిపారు. రోగులకు అత్యాధునిక వైద్య సేవలందించడం, నాణ్యతా ప్రమాణాలు పాటించడంతోనే ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఐఎస్‌వో గుర్తింపు లభించిందన్నారు. ఈ అవార్డు తాము రోగులకు మరిన్ని వైద్య సేవలందించేందుకు అవకాశం కల్పించిందంటూ హర్షం వ్యక్తం చేశారు.

సిద్ధార్థ ఆసుపత్రికి ఐఎస్‌వో అంతర్జాతీయ అవార్డు

ఇదీ చూడండి:పట్టభద్రుల ఎమ్మెల్సీ నామపత్రాల పరిశీలన పూర్తి

ABOUT THE AUTHOR

...view details