రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని బర్హాన్ ఖాన్ చెరువు దాని లోతట్టు ప్రాంతాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో ఇరిగేషన్ ఎస్ఈ హైదర్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్ పరిశీలించారు. గతేడాది కురిసిన వర్షాలకు వందలాది ఇళ్లు నీట మునిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు - Irrigation officers visited jalpalli
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో ఇరిగేషన్ ఎస్ఈ హైదర్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్ జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. గతేడాది మునిగిపోయిన ప్రాంతాలను పరిశీలించారు.
officer
గతంలో ఇళ్లు నీటిలో మునిగిపోవడానికి గల కారణాలు, చెరువు కట్ట, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ హైదర్ ఖాన్, ఈఈ బన్సీలాల్, డీఈ జగదీశ్వర్, ఏఈ గంగరాజు, జల్ పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.